
ఏడది మద్నూర్ మండలంలో వానాకాలం పంట సాగులో భాగంగా వ్యవసాయ రైతులు అత్యధికంగా పెసర మినుము సోయా పత్తి కంది పంటలు సాగు చేశారు. ఈ పంటలకు దాదాపు 15 రోజులకు ఒకసారి పిచికారి మందు వాడవలసి ఉండగా, గత 15, 20, రోజులుగా అల్పపీడన ప్రభావం మూలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాగు చేసిన పంటలకు పురుగుమందు పిచికారి చేయడానికి ముసురు వర్షాలు సమయం ఇవ్వలేకపోగా, సోమవారము ఉదయం వాన తగ్గింది. వాన లేదు అనుకుంటూ వ్యవసాయ రైతులు పిచికారి మందుల కోసం ఫర్టిలైజర్ షాపులకు బారులు తీరారు. ఉదయం వాన లేదు అనుకోని పిచికారి మందులు కొనుగోలు చేయగా మధ్యాహ్నం మళ్లీ వాన ప్రారంభమైంది. ఈపాటికి పురుగుమందులు పిచికారి చేయలేక సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్న రైతన్నలకు మధ్యాహ్నం కురిసిన వాన మరింతగా ఆందోళన కలిగించింది. కొంతమంది రైతులు ఉదయం నుండి పంటలకు పిచికారి మందులు పంపుల ద్వారా పిచికారి చేయించగా, మధ్యాహ్నం వాన రావడం పిచికారి మందు పని చేస్తుందో లేదో అనే ఆందోళన రైతన్నల్లో వ్యక్తమైంది. ఏది ఏమైనా కొద్దిపాటి గరుభూ దొరుకుతే పిచ్చిగారి మందులు వాడెందుకు రైతులంతా పురుగుమందుల కొనుగోలు చేస్తున్నారు. వాతావరణం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మళ్లీ మారిపోవడం వర్షపు జల్లులు రావడం పురుగుమందులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఒకటి రెండు రోజులైనా వర్షాలు తగ్గుముఖం పడితే పురుగుమందుల పిచికారికి సమయం దొరుకుతుందనే ఆశ రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఈపాటికి సమయం సారంగా పంటలకు రెండు సార్లు అయినా పురుగుల మందులు పిచ్చిగారి చేసి ఉండేవారు. వర్షం సమయం ఇవ్వకపోవడం పురుగుమందులు వాడలేక పంటలకు తెగుళ్లు వచ్చే ఆస్కారం ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు సోకే తెగుళ్లపట్ల వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణ చర్యలు రైతులకు తెలియజేయాలని వ్యవసాయదారులు వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు.