రైతు వేదికల్లో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు

Farmers' loan waiver celebrations are celebrated in farmers' venues

నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం రైతులకు  రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటించింది. ఈ మేరకు పలు విడుతలలో రుణమాఫీ అందజేయనుండగా గురువారం లక్ష రూపాయల రుణము కలిగిన రైతులను ప్రకటించి, మండలంలోని రైతు వేదికలలో రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయాధికారులు రుణమాఫీ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి  క్లస్టర్ పరిధిలో‌ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొట్టె మధు ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి మెంబర్ బత్తిని శ్రీనివాస్ హాజరై కేకును కట్ చేసి,  స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ, లింగాపూర్ గ్రామ అధ్యక్షుడు టి. నారాయణ రెడ్డి, నాయకులు మందాడి శ్రీనివాసరెడ్డి దర్శనాల ఓంకార్, బొమ్మన గట్టయ్య, ఏ ఈ ఓ రాజ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.