రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం..

నవతెలంగాణ – తిరుమలగిరి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా పథకం పై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ సహకార సంఘం  అధికారి శ్రీనివాస్, మరియు అసిస్టెంట్  రిజిస్టార్ రామచంద్రయ్య లు హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం పై రైతులు తమ తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తపరచాలని కోరారు. పలువురు రైతులు మాట్లాడుతూ కనిష్టంగా ఐదు ఎకరాల వరకు గరిష్టంగా 10 ఎకరాల వరకు సాగు చేసే భూమికి మాత్రమే రైతుబంధు వర్తింపజేయాలని మెజార్టీ సభ్యులు తెలిపారు. సాగు చేయని భూములకు, ఓపెన్ ప్లాట్ లకు రైతుబంధును తొలగించాలని అభిప్రాయపడ్డారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేయాలని తెలిపారు. రైతుబంధు పెట్టుబడి సాయం పంట సాగు ప్రారంభించే ముందే ఒకటే విడతలో మంజూరు చేయించాలని అభిప్రాయబడినారు.అనంతరం రైతుల అభిప్రాయాలను స్వీకరించిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, సహకార సంఘం సభ్యులు, డైరెక్టర్లు వజ్జే  శంకర్,రావుల సత్తయ్య, బానోతు కిష్ట నాయక్, లావుడ్యా రంజా తదితర డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.