మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచిత్రపటానికి పాలాభిషేకం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీవరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రైతు పక్ష పాతి అని, తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ఆగస్టు 15 లోపే పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి గా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీ మేరకులక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రైతులం దరికీ రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.2లక్షల రుణమాఫీ దేశ చరిత్రలో గొప్ప పథకంగా నిలుస్తుందన్నారు.ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం,రూ. 500గ్యాస్ సిలిండర్,రైతు బంధు,ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించామని తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయని కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పు కొంటూ రైతులను మోసం చేయడమే కాకుండా నేడు వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయ డం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, శామప్ప, మల్లప్ప పటేల్, మోహన్, నాగరాజు, శ్రీనివాస్ రషీద్, ఫెరోజ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.