త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని కలెక్టరేట్‌ వద్ద రైతుల నిరసన ధర్నా

– అరెస్టు తుర్కపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
నవ తెలంగాణ -భువనగిరి రూరల్‌
త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద రైతులు చేపట్టిన ధర్నా మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కాగా మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సందర్భంగా కలెక్టరేట్‌ జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ మేరకు మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే మంత్రిని కలిసేందుకు ప్రయాత్నం చేశారు. రైతులు ఆదోళన నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున్న పోలీసులు మోహారించారు. దీంతో ఉదయం కలిసేందుకు ప్రయాత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సమీక్ష సమావేశం అనంతరం కలెక్టరేట్‌ నుంచి మంత్రి వెళ్ళేందుకు సన్నాగ్ధం అవుతున్న నేపథ్యంలో తెలుసుకున్న రైతులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద గడ్డిమోపు తెచ్చి అక్కడి నుంచి వెళ్ళానివ్వాకుడా అడ్డుకోవడం కోసం దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున్న కలెక్టరేట్‌ ముందు ఆదోళనకు దిగారు. దీంతో పోలీసులు ప్రధాన గేటు ద్వారం కాకుండా కలెక్టరేట్లో నుంచి కలెక్టర్‌ బంగ్లాకు వెళ్ళే గేటు నుంచి మరోక ద్వారం నుంచి రోడ్డుపైకి వచ్చారు. గమణించిన రైతులు ఒకే సారి మంత్రి కాన్వాయిని అడ్డుకుని దానికి పై దాడి చేసే ప్రయాత్నం చేశారు. అప్పటికి భద్రత సిబ్బంది, పోలీసులు, వారికి అడ్డుకుని కాన్వాయి అక్కడి నుంచి పంపించారు. ప్రభుత్వం వెంటనే త్రిబుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రద్దు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ముందు బిష్మించి కూర్చున్నారు. పోలీసులు, రైతులు మధ్యన గొద్దిసేపు వాగ్వాదం జరిగింది. నాయకులను అరెస్టు చేసి , తుర్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అరెస్ట్‌ అయిన వారిలో రైతులు తంగెలపల్లి రవికుమార్‌, పల్లెర్ల యాదగిరి, బిజెపి నాయకులు గూడూరునారాయణరెడ్డి తో పలువురు ఉన్నారు.