ధాన్యాన్ని తరలించాలని రైతుల నిరసన

నవతెలంగాణ – చందుర్తి
కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరగా తరలించాలని మంగళవారం మండల కేంద్రంలో సహకార సంఘం ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కల్లాల లో ఆరబెట్టి నెల రోజులు గడిసిన ఇప్పటి ధాన్యాన్ని తూకం వేయకుండా తరలించకుండా జాప్యం చేస్తున్నారని వాపోయారు. రెండు, మూడు రోజులు వర్షాలు ఉన్నాయని తమ ధాన్యం తడిస్తే ఎవరు బాద్యుల ని మాట్లాడారు. వెంటనె తమ వరి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేసారు.