ఆలూరు మండలంలోని గుత్ప గ్రామంలో గల దక్కన్ గ్రామీణ బ్యాంకు ముందు రైతులు తమకు రుణమాఫి రాలేదని సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, మండల కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ ఏక కాలంలో రూ. రెండు లక్షల పంట రుణమాఫి చేస్తాన్న ప్రభుత్వం మూడు దశల పేరుతో రైతులకు ఎగనామం పెట్టే కార్యక్రమంలో ఉందన్నారు. ఇప్పటి వరకు రూ. లక్ష యాభై వేల వరకే రుణమాఫి వచ్చిందని తెలిపారు. దక్కన్ గ్రామీణ బ్యాంకులో మోత 1200 మంది రైతులు రుణం పొందారని అందులో 500 మంది రైతులకు మాత్రమే పంట రుణం వచ్చిందని, మిగతా 700 మందికి నిరాశే మిగిందన్నారు. వెంటనే సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు ఇక కాలంలో రుణమాఫి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ప్రభాకర్, బిజెపి ఎంన్డల కార్యదర్శి శ్రీకాంత్, బాగా గంగాధర్, సురేష్, ప్రేమ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.