– నేడు రైతుల ఖాతాల్లో రూ.లక్ష రుణమాఫీ జమ
– మండల వ్యాప్తంగా మొదటి విడత లబ్ది పొందనున్న 1854 మంది రైతులు
– జామ కానున్న రూ.10,44,62,835 కోట్లు
– నేడు చౌదరిపల్లి రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్
– రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మండల ఏఓ పిలుపు
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.2 లక్షల రుణ మాఫీతో రైతుల్లో హర్షాతిరేకాలు మొదలయ్యాయి. గురు వారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత రైతు ఖాతాల్లో రూ. లక్షలోపు రుణమాఫీ జమ కానుంది. మండల పరిధిలోని 1854మంది రైతులు లబ్ది పొంద నున్నారు. మండల వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.10, 44,62,835 కోట్లు జమ కానున్నాయని మండల వ్యవ సాయ అధికారి సందీప్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తె లిపారు. మండలం పరిధిలోని మొదటి క్లస్టర్‌లో చౌదర్పల్లి 64, గున్‌గల్ 131, మొండి గౌరెల్లి 111, తులేకుర్దు 158, రెండవ క్లస్టర్‌లో చింతపట్ల 199, మంతన్ గౌడ్ 58, మం తన్ గౌరెల్లి 68, నల్లవెల్లి 256, సుల్తాన్పూర్ 39, మూడవ క్లస్టర్‌లో కొత్తపల్లి 169, కుర్మిద్ధ 86, మేడిపల్లి 8, నక్కర్త 25, నానక్‌నగర్ 8, తాడిపర్తి 14, నాలుగవ క్లస్టర్‌లో మల్కీజ్‌గూడ్ 37, మొగుళ్ళపంపు 14, నందివనపర్తి 260, సింగారం 44, తక్కళ్ళపల్లి 32, యాచారం 73 చొప్పున రైతులందరూ మొదటి విడతలో రూ.లక్షలోపు రుణమాఫీ పొందనున్నారు. రెండో విడతలో మండల పరిధిలోని మరి కొంతమంది రైతులు రుణమాఫీ పొందనున్నారని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
చౌదర్పల్లి రైతు వేదికలో గురువారం సీఎం వీడియో కాన్ఫరెన్స్
మండల పరిధిలోని చౌదర్పల్లి రైతు వేదికలో గురువారం రుణమాఫీ విడుదల గురించి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మధ్యా హ్నం 3:30 గంటలకు ఉంటుందని తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల రైతులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. మొదటి విడతలో రూ. లక్షలోపు రుణమాఫీ అర్హు లైన రైతులందరూ పొందునున్నారని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు లతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారని తెలిపారు. రైతులు పెద్దసంఖ్యలో చౌదర్పల్లి రైతు వేదికకు హాజరుకావాలని సూచించారు.
సందీప్, మండల వ్యవసాయ అధికారి