– సమన్వయ లోపంతోనే సాగునీరు అందట్లే..
– లైట్ తీసుకున్న ఉన్నతాధికారులు..
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రస్తుత యాసంగి సీజన్లో లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. డివిజన్ నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టులో నీరున్నా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బిర్కుర్ మండలంలో దాదాపు 22 వేల ఎకరాలు సాగుచేస్తున్న చెరువు కట్టల కింద ఉన్న రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రధానంగా బీర్కూర్ మిర్జాపూర్, కిష్టాపూర్ దామరాంచ, గ్రామ శివారులో వరి పంటలకు నీళ్లందక ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతుండగా, పలు గ్రామాల్లో మక్క పూర్తిగా కంకులు వేయడంలేదు. దీనికి జిల్లా, డివిజన్ అధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయిలో సిబ్బంది కొరతే కారణమని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.లైట్ తీసుకున్న ఉన్నతాధికారులు: నిజాంసాగర్ పరిధిలో ప్రధాన కాల్వ కింద ఆయకట్టు ఉంద గులుసు కట్టు చెరువులు ఉన్నాయి చెరువులు నిల్వ చెయ్యడంలో అధికారులు విఫలం కావడంతో పంటలు ఎండుతున్నాయి. సాగునీటి అధికారులు ,కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులతో సాగునీటి అధికారుల సమన్వయం చేయాల్సిన సాగునీటి ఉన్నతాధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఆయకట్టు ముందున్న తూములు, కాల్వల ద్వారా నీరు వృథాగా పోవడం, చివరలో ఉన్న భూములకు నీరందకపోవడం వంటి సమస్యలు వచ్చాయంటున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆయకట్టు. కింద ఉన్న గొలుసు కట్టు చెరువులకు నీరు చేరక పోవడంతో చెరువుల్లో నీరు లేక పోవడంతో బీర్కూరు నల్లచెరువు ఆయకట్టు కింద ఉన్న వరి పంటలు ఎండిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. చెరువు కట్ట తూము శిథిలావస్థకు చేరడం, తూముల్లో పూడికచేరి నీరు బయటకు రాక, ఆ తూము కింద ఉన్న ఆయకట్టు భూములు ప్రస్తుతం ఎండు దశకు చేరుతుంది. ఇప్పటికే పొలాలన్నీ నెర్రెలు వేసాయి. పొట్ట దశలో నీరు అందక పంటలు ఎండడానికి సిద్ధంగా ఉండడంతో, అన్నదాత కంట నీరు పెడుతున్నారు. శిథిలావస్థకు చేరిన తూము నుంచి నీటిని బయటకు తీసుకురావడానికి తూముల్లో ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. అన్నదాతలు కష్టపడుతున్నప్పటికీ సాగునీటి పారుదల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం రైతులకు శాపంగా మారింది. మరో వారం రోజుల్లో నీరు అందకుంటే నల్లచెరువు తూము ఆయకట్టు కింద ఉన్న వందనాలు ఎకరాల వరి పంట చేతికి రాకుండా పోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అధికార పార్టీ నేతలు స్పందించి వెంటనే, తూము బాగు చేయించి ఎందుతున్న పంటలకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలంటు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.