– ఎస్సై సురేష్ ,ఎన్ పిడిసిఎల్ ఏఈ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – రామగిరి
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీపై నిఘా పెంచాలని గోదావరిఖని-2 టౌన్ ఎస్ఐ సురేష్, రామగిరి మండల ఎన్పీడీసీఎల్ ఏఈ కోరండ్ల మహేందర్ రెడ్డిలు గ్రామస్థులను కోరారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో 2- టౌన్ సిఐ నక్క ప్రసాద్ రావు సూచన మేరకు ట్రాన్స్ఫార్మర్ల చోరీ జరగకుండా చర్యలపై శుక్రవారం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ శివారులో అపరిచితులు ఎవరు సంచరించిన, అనుమానితంగా ఎవరు కనిపించిన వెంటనే 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాత్రిపూట గ్రామ శివారు రైతులు గస్తీ తిరగాలని సూచించారు. పోలీస్ సిబ్బందితో శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామ రైతులు, విద్యుత్ సిబ్బంది లైన్ ఇన్స్పెక్టర్ అప్పాసి నాగరాజు, లైన్ మెన్ రాజేందర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.