రైతులు రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి

నవతెలంగాణ – తొగుట
రైతులు రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకోవాల ని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఆది వారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం మండల రైతులు కొత్తగా జూన్ 28వ తేదీ వరకు పట్టా దార్ పాస్ బుక్ పొంది, 18 నుండి 59 సంవత్సరాలు వయసు కలిగిన రైతులు రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా క్లస్టర్ పరిధిలో విస్తరణ అధికారుల వద్దకు వెళ్ళి 1. రైతు పట్టాదార్ పాస్ బుక్, 2. రైతు ఆధార్ కార్డు, 3. నామిని ఆధార్ కార్డు, 4.దరఖాస్తు ఫారం జిరా క్స్ పత్రాలు ఆగష్టు 5 తేదీ లోగ వ్యవసాయ విస్త రణ అధికారులకు అందచేయలని సూచించారు.