నవతెలంగాణ-మర్పల్లి
ప్రభుత్వం అందించే రైతుభీమా 2024 సంవత్సరం పాలసీ కోసం రైతులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వసంత, ఏఈఓలు మహేష్, నీరజ సోమవారం వేరువేరు ప్రకటనలో పేర్కొన్నారు. రైతు బీమా కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే రైతులు గత జూన్ 28 తేదీలోపు కొత్త పట్టా పాస్ బుక్కు వచ్చిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. ఇంతకుముందు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకొని వారు చేసుకోవాలని, మార్పులు చేర్పులు చేసుకునేవారు సరి చేసుకోవాలని వారు సూచించారు. 14 ఆగస్టు1965 నుంచి 14 ఆగస్టు 2006 మధ్యలో పుట్టి 18 నుంచి 59 ఏండ్లలోపు రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు దరఖాస్తు ఫారం, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్‌ను తీసుకొని స్వయంగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు