– ఆమనగల్, కడ్తాల్ మండల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత
– 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులు అర్హులు
నవతెలంగాణ-ఆమనగల్
మండలంలోని రైతులు రైతు బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్, కడ్తాల్ మండలాల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వారు తెలిపారు. అదేవిధంగా 2024 జూన్ 28వ తేదీ వరకు భూములు కొనుగోలుకు సంబంధించిన పట్టా పాస్ బుక్‌లు అందుకున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పట్టాదారు పాస్ బుక్, రైతు బ్యాంక్ పాస్ బుక్, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, మొత్తం నాలుగు జిరాక్స్ కాపీలను బీమా దరఖాస్తు ఫాంకు జతచేసి దరఖాస్తు దారు రైతులు మాత్రమే స్వయంగా సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని వారు సూచించారు. నూతనంగా భూములు కొనుగోలు చేసిన రైతులతో పాటు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని రైతులు, గతంలో చేసిన దరఖాస్తుల్లో తప్పులు నమోదైన వారు, నామిని పేరు మార్పు చేయాలనుకున్న రైతులు ఆగష్టు 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు.