
ప్రతీ రైతు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నాగరాణి తెలిపారు. శుక్రవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు. రైతులకు అసైన్మెంట్ భూములు, విత్తనాలు, విద్యుత్, మార్కెట్ వంటి చట్టాలను వివరించారు. రైతు విత్తనం కొనుగోలు మొదలు పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలను అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు న్యాయంగా రైతులకు అందేలా చూడాలని అధికారుకు తెలిపారు. అనంతరం రైతు వేదికలోని అగ్రీ లీగల్ క్లినిక్ ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శోభ, ఏఈఓలు, పిఎల్వీలు నరేష్, సంతోష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.