– కుస్మసముద్రం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి చెలిమిల్ల నిఖిత
– రైతులకు విత్తనాలపై అవగాహన
నవతెలంగాణ-కుల్కచర్ల
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కుస్మసముద్రం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి చెలిమిల్ల నిఖిత అన్నారు. శనివారం కుల్కచర్ల మండలం కుస్మ సముద్రం గ్రామంలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు (పత్తి, వడ్లు, మొక్కజొన్న) పాకెట్లలో ఉండే విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలన్నారు. పంట చేతికి వచ్చేవరకు రసీదును జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. లూజ్ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో రైతులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.