ఏర్గట్ల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు శుక్రవారం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం మాట్లాడుతూ… కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాక మునుపు,ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఏకకాలంలో, ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రేస్ పార్టీ హామినిచ్చిందని,ఇప్పుడు విడతల వారిగా రుణమాఫీ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. అలాగే అధికారంలోకి వచ్చాక రైతుబంధు సహాయాన్ని ఎకరానికి రూ.10 వేల రూపాయల నుండి రూ.15 వేల రూపాయలకు పెంచుతామని, ఆ భాధ్యతను కాంగ్రేస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారని,యావత్ రైతాంగాన్ని మోసం చేయడం ఆయనకు తగదని అన్నారు.ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకుంటే,బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ముందుండి కొట్లాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్,మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి,నాయకులు నెరేళ్ళ లింగారెడ్డి,దేవుడు నర్సయ్య,రొక్కెడ మోహన్,కట్కం సాగర్,వేశాల నర్సారెడ్డి,ప్రవీణ్ యాదవ్,కూతురు సాయన్న తదితరులు పాల్గొన్నారు.