
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని వాగ్దానం చేసింది వాగ్దానం చేసిన ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మాస్ లైన్ పార్టీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలోని లెనిన్ నగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఈరోజు ప్రభుత్వం వచ్చాక వివిధ శాఖల తోటి ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని అన్నారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీ కాడికి వచ్చేసరికి రేషన్ కార్డు చూపుతుంది ఇది సరైన విధానం కాదని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను రద్దు చేయాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతును గుర్తించి బే షరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల తోటి రైతులను ఇబ్బందుల పాలు చేస్తే పార్టీ ఆధ్వర్యంలో తగిన తీసుకునేతవరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, పార్టీ పట్టణ అధ్యక్షులు గులాం ఐఎఫ్టియు జిల్లా నాయకులు వాజీద్, పార్టీ నాయకులు ఎల్లన్న సురేషు మహేష్ పి ఓ డబ్ల్యు కోశాధికారి జయమ్మ , జానయ్య, బాజీ ,పద్మ, భవాని తదితరులు పాల్గొన్నారు.