ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి

Navatelangana,Telugu News,Telangana,Khammam– సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-ఖమ్మం
కోతలు, కొరతలు, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని సీపీఐ (ఎంఎల్‌ ) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో అనేకమంది రైతులు భయాందోళనలకు గురవుతున్నారని, గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, రేషన్‌ కార్డులో పేర్లు తొలగించడం గాని చేర్చడం కానీ అవకాశం లేదని, దీని కారణంగా దశాబ్దం కితమే వేరైనా కుటుంబాలు సైతం రేషన్‌ కార్డులో ఒకే కుటుంబం ఉంటే ప్రమాదం ఉందని, కనుక దాని పరిగణలోకి తీసుకుంటే చాలామంది రైతులు రుణమాఫీ అమలు కాదని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులు నిబంధన తొలగించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. అదేవిధంగా ల్యాండ్‌ ఎలిజిబిలిటీ కార్డుల ద్వారా అనేక వేలమంది సన్న చిన్న కారు రైతులు రుణాలు పొందారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి రుణమాఫీ జరిగే అవకాశం లేదని, తక్షణమే ల్యాండ్‌ ఎలీజీబిలిటీ కార్డు ద్వారా రుణాలు పొందిన రైతులందరికీ కూడా రుణమాఫీని అమరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఒక ఎకరం భూమి ఉన్న రైతులను కలిపి జేఎల్సి అనే గ్రూపులు ఏర్పర్సి దానిద్వారా రైతులకు రుణాలు ఇచ్చారని, అటువంటి రైతులకు రుణమాఫీలు ప్రభుత్వ ఏం చేయదలుచుకుందని ప్రశ్నించారు. సుమారు 16 లక్షల మంది తెలంగాణలో కౌలు రైతులు ఉన్నారని, వీరికి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించే ప్రయత్నం చేయటం లేదని, దానివల్ల నిజంగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల కు అటు గిట్టుబాటు ధర రాక ఇటు రైతు భరోసా అందగా రుణాలు మాఫీ కాక మరింతగా అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కౌలు రైతును గుర్తించి వారికి పంట రుణాలు పెట్టుబడి సాయం రుణమాఫీ అందజేయాలని అన్నారు.
రేషన్‌ కార్డులు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి డబ్బులు పెన్షన్లు పోడు భూములకు పట్టాలు తదితర సమస్యలపై ఈనెల 22న తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నట్లు, 29న జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకి నిర్వహించాలని ఆగస్టు 21న చలో హైదరాబాద్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.రంగయ్య, చిన్న చంద్రన్న, గుమ్మడి నరసయ్య, వీ. ప్రభాకర్‌, గోకినపల్లి వెంకటేశ్వర్లు, ముద్ద బిక్షం, ఎం. కష్ణ, రామకష్ణ, గుర్ర ఆచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, సివైపుల్లయ్య, అవుల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.