జన్నారం క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాలలో రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని రైతులు ధ్రువపత్రాలతో సిద్ధంగా ఉండాలని ఏఈఓ త్రిసంధ్య కోరారు. శుక్రవారం ధర్మారం, రేండ్లగూడ, బాదంపల్లి, జన్నారం, పోనకల్ గ్రామాలలో సమావేశం నిర్వహించి రైతుల నుండి ధ్రువపత్రాలు తీసుకుంటామన్నారు. రుణమాఫీ స్వీయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, క్రాప్ లోన్ అకౌంట్ జిరాక్సులతో రైతులు సిద్ధంగా ఉండాలని ఆమె కోరారు.