రైతులను బేషరతుగా విడుదల చేయాలి 

Farmers should be released unconditionallyనవతెలంగాణ – రామారెడ్డి 
కొడంగల్ నియోజకవర్గం లోని లగచర్లలో అక్రమంగా అరెస్టు చేసిన ఎస్సీ ,ఎస్టీ ,బీసీ రైతులను బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం బి ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ స్వలాభం కోసం లగచర్లలో ఫార్మాసిటీ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి, బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందని, అక్రమాలను అడ్డుకున్న రైతులను భయాందోళనలకు గురిచేసి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, రైతులను వంచించిన ప్రభుత్వం ఎక్కడ కూడా తిరిగి అధికారంలోకి రాలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలో అదే గతి పడుతుందని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, మండల ప్రెసిడెంట్ రంగు రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గడ్డం రవీందర్ రెడ్డి, గురజల నారాయణరెడ్డి, తుపాకుల రాజేందర్ గౌడ్, గర్గుల రాజా గౌడ్, కొత్తొల్ల గంగారం, పడిగెల శ్రీనివాస్, లింబాద్రి నాయక్, తదితరులు పాల్గొన్నారు.