
పీఎం కిసాన్ కు రైతులు ఈ కేవైసీ, ఆధార్ సీడింగ్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ శుక్రవారం సూచించారు. మండలంలోని కన్నాపూర్ తండాలో రైతులకు అవగాహన కల్పించారు. మద్దికుంటలో భారతీయ కిసాన్ సాంగ్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయం మెలకువలు, తదితర అంశాలపై ఏఈఓ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాకేష్, గాయత్రి, ప్రణతి, మండల భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులు కె రాజశేఖర్, రైతులు బండి ప్రవీణ్,ముత్యాల రాజు, తదితరులు పాల్గొన్నారు.