లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ పంటపై రైతులు దృష్టి సారించాలి

– దుబ్బాక ఏడిఏ మల్లయ్య
నవతెలంగాణ- దౌల్తాబాద్ : రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్ ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలని దుబ్బాక ఏడిఏ మల్లయ్య అన్నారు.గురువారం దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో మొదటిసారిగా ఆయిల్ ఫామ్ పంట కోత ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సూరంపల్లి గ్రామంలో రైతు నరేందర్ రెడ్డి సాగు చేసిన ఆయిల్ ఫామ్ పంట మొదటిసారిగా కోతకు రావడం జరిగిందని మొదటి కోతలో ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత నికరంగా ఎకరానికి 10 టన్నులు వస్తుందన్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలోనే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని గేలలు ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మూడు రోజుల్లో నగదు రైతు ఖాతాల్లో జమవుతుంది. 2025 జూన్ నాటికి నంగునూరులో మండలంలో ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 12 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులో ఉందన్నారు.ఆయిల్ ఫామ్ తోటలో మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. మొక్కజొన్న, వేరుసెనగ, పప్పు, ధనియాల వంటి అనేక పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు సూచనలు చేయడం  జరిగిందన్నారు.3 సంవత్సరాల దాటిన ఆయిల్ పామ్ తోటలకి నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేయడం జరిగింది. రైతులకు,కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ  సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా డ్రిప్ మరియు మొక్కలను ఇవ్వడం జరుగుతుంది.  ఫామాయిల్ చెట్లు నాటిన 14 నెలలకు పూత ప్రారంభమవుతుంది. మొక్క 30 నేలలు వయసు వచ్చేవరకు లేత దశలో మగ ఆడ పుష్పాలన తప్పనిసరిగా తొలగించాలి. తద్వారా చెట్టు యొక్క మాను (మొదలు భాగం) బాగా ఊరుతుంది. తద్వారా 36 నెలల వయసులో గెలల బరువు బాగా వస్తుంది. ఎకరానికి నికరంగా ప్రతి సంవత్సరం 10 టన్నుల పామాయిల్ దిగుబడిని పొందవచ్చు. ఐదు సంవత్సరాల తర్వాత ఆయిల్ పాములో కోకో పంట కూడా వేసుకోవచ్చు. దీనివలన అధిక లాభాలు నికరంగా ఎకరానికి లక్ష వరకు ఆదాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు సంతోష్, బాపురాజు, ఆయిల్ ఫీడ్ ఫీల్డ్ ఆఫీసర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.