• మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి
నవతెలంగాణ పెద్దవంగర:
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. మంగళవారం పోచంపల్లి గ్రామంలోని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏఈవో తో కలిసి టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందే ఇంటి వద్ద, లేక కల్లాల వద్ద ఆరబెట్టుకుని, తగిన తేమతో, మట్టి పెళ్లలు లేకుండా నాణ్యత కలిగిన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో విశ్వశాంతి, సీసీ సుజాత, రైతులు పాల్గొన్నారు.