నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని రైతులకు విద్యుత్తు అదచేసే కెపాసిటర్ ను నిజామాబాద్ డివిజన్ ఏడీ ఎం. అశోక్ శుక్రవారం అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ అదచేసే కెపాసిటర్ అమర్చుకోవడం వల్ల ట్రాన్స్ఫర్, మోటార్ బోరుపై లోడ్ పడదన్నరు. ఐఎస్ఐ మోటార్ పెట్టుకోవాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని, ప్లాస్టిక్ వస్తువులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ ఎం. శ్రీనివాస్, ఏఇ గోపి, సబ్ ఇంజనీర్ జాన్సన్, ఎస్ సి లైన్ మెన్ గోపి నాయక్, లైన్ మెన్ నాగ భూషణం, పవన్, గ్రామ కమిటీ అద్యక్షులు నరేందర్, నడపి గంగాధర్, కుమ్మరి గంగాధర్, నారాయణ, కుమ్మరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.