
నవతెలంగాణ – తొగుట
రాష్ట్రవ్యాప్తంగా పొద్దుతిరుగుడు ధాన్యాన్ని ప్రభు త్వంమే కొనుగోలు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుతిరు గుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతు లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. రెండు, మూడు రోజులలో సొసైటీ ఆధ్వర్యంలో తొగుట మండలంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభింస్తామని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం క్వింటాకు రూ. 6,760 కొనుగోలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పిం చిన గిట్టుబాటు ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ము కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సీఈఓ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.