రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

– వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి

నవతెలంగాణ – రాయపర్తి
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని పెర్కవేడు, రాయపర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ చూసి త్వరగా కాంటాలు పెట్టాలని సూచించారు. రైతులను నష్టపోకుండా ధాన్యం కొనుగోలు నిర్వహణ కొనసాగించాలని తెలిపారు. రైతులు ధాన్యంలో తాలు శాతం తక్కువగా ఉండే టట్లు చూసుకోవాలి అన్నారు. వర్షాభావం సూచన ఉన్నందువలన రైతులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. నిర్వాహకులు రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని తెలిపారు. రైతులకు నిలువ నీడ, త్రాగునీరువంటి సౌకర్యాలనుకల్పించాలన్నారు. ఆమెతోపాటు డీసీఓ సంజీవరెడ్డి, డిఎం సంధ్యారాణి, తహశీల్దార్ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, ఆర్ఐ చంద్రమోహన్, ఐత మల్లేష్, రాకేష్ తదితరులు ఉన్నారు.