రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్య దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించినమద్దతు ధరను పొందాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య అన్నారు. మంగళవారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాధగోని నరసింహా భవనంలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశానికి రామలింగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పత్తి, వరిధాన్యం పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. డిసెంబర్ 30న నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్ సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య, మండల కార్యవర్గ సభ్యులు తిప్పర్తి రాములు, బరిగల వెంకటేష్,దోటి వెంకన్న, బండమీది వెంకన్న, సిహెచ్ ఉషయ్య, ఇరిగి సంజీవ తదితరులు పాల్గొన్నారు.