
– మద్నూర్ డోంగ్లి మండలాల రైతులకు మండల వ్యవసాయ అధికారి రాజు సూచన
నవతెలంగాణ- మద్నూర్
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా మద్నూర్ మండలంలోని లేండి వాగు నది వైపు డోంగ్లి మండలంలోని మంజీరా నది వైపు రైతులు వెళ్లకూడదని ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పరిస్థితుల్లో పంటలకు ఎరువులుగాని కలుపు మందుగానీ పురుగుల మందులుగాని వెయ్యవద్దని మద్నూర్ డోంగ్లి మండలాల వ్యవసాయ అధికారి రాజు ఒక ప్రకటన ద్వారా వ్యవసాయదారులకు సూచనలు జారీ చేశారు. వ్యవసాయదారులకు విజ్ఞప్తి చేస్తూ పైనుండి కురుస్తున్న వర్షంలో పొలాల్లోకి వెళ్ళరాదని వర్షం తగ్గిన తర్వాతే పొలంలో నిలిచిన వర్షపు నీరు గండ్లు తీసి నీళ్లను తీసివేయాలని వర్షాలు తగ్గిన తర్వాత వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు మేరకు పంటలు దెబ్బతిన్న వాటికి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు. మంజీరా నది పరివాహక గ్రామాల రైతులు నది ఒడ్డుకు వెళ్లరాదని భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే సూచనలు ఉన్నందున మంజీరా నది వైపు వెళ్లకూడదని ప్రత్యేకంగా సూచన చేశారు వ్యవసాయ అధికారి హెచ్చరికను పాటించి పొలాల్లోకి వెళ్ళకూడదని నదుల వైపు వెళ్ళకూడదని ఆయన కోరారు.