– వడగళ్ల వాన అపార నష్టం..
– మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం 6,30 గంటలకు పరిశీలించారు. శనివారం రాత్రి బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్, నసురుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు బీర్కూర్ మండలం కిష్టాపూర్, బీర్కూర్, అన్నారం, చించోలి గ్రామ శివారులో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వడగళ్ల వానతో నష్టపోయిన వరి పంట పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పంట పొలాల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కు, జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్లో మాట్లాడారు నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను కోరారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభం అయ్యాయని అందుకు అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసిన రైతుకు తక్కువే అని అన్నారు. రైతులు అధైర్య పడొద్దని తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుక వెళ్తానన్నారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికారులకు కోరారు. స్వయంగా పోచారం పంట పొలాల్లోకి వెళ్లి నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు నీటమునిగిన పంటలను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు అధైర్య పడొద్దని సూచించారు. వీరి వెంట అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.