రైతులు తమ పొలాల చుట్టూ అడవి జంతువుల నుండి తమ పంటల రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ కంచెలు వేయవద్దని పి జి ఎన్ పి ఏ డి సి ఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కంకటి మాధవరావు అన్నారు. మండలంలోని రచ్చపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల పొలం బాట కార్యక్రమం శనివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కంకటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారులతో మాట్లాడుతూ.. గ్రామం లో విద్యుత్ సమస్యలుఉన్నాయా అని వివరాలు అడిగి తెల్సుకున్నారు. రైతులు వారి పొలాల వద్ద స్టారర్లు, ఫ్యూజులు, స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, మోటర్ లకు కెపాసిటర్లు బిగించుకోవాలని రైతులకు సూచించారు. విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి, టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. రైతులు లోవోల్టేజి సమస్య రాకుండా కెపాసిటర్లు బిగించుకోవాలని టిజిఎన్ఏపిడిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు అన్నారు. కెపాసిటర్ మోటార్లకు ఉంటె మోటార్ మన్నికగా ఎక్కువ కాలం పనిచేస్తాయని లో ఓల్టేజి సమస్యలు కూడా ఉండవని తెలిపారు. వంగిన కరెంటు స్థంబాలు , లూస్ లైన్లు, పాడైన ఐరన్ స్తంబాలు, లో వోల్టాజ్ సమస్యలు వస్తే వెంటనే సబ్ స్టేషన్ సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ కి గాని విద్యుత్ సిబ్బందికి గాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటి వరకు రచ్చపల్లి గ్రామం లో 127 కరెంటు స్తంభాలను లూస్ లైన్లను సరిచేయడం కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు తమ పొలాల చుట్టు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని, తద్వారా రైతులు, పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు, పెద్దపల్లి డివిజనల్ ఇంజనీర్ దాసరి తిరుపతి, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ బి. రవి, అసిస్టెంట్ రీజనల్ ఇంజనీర్ విజయ్ గోపాల్ సింగ్ ఏ ఈ, మహిపాల్ రెడ్డి, విద్యుత్ సెక్షన్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.