నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు దళారులను ఆశ్రయించొద్దని,పండించిన వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు సూచించారు. గురువారం మండలంలోని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ సంగ్గెం రమేష్, రుద్రారం ఉప సర్పంచ్ బుడిగే వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,ఏఈఓ మనీషా,పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.