మహిళా సంఘాల IKP SERP ఆధ్వర్యంలో ఈ రోజు చెంగల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మరియు మార్కెటింగ్ డీపీఎం సాయిలు,చెంగల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 100% రైతులు పండించే పంటను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడకుండా ఉండాలని, దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బోదిరే స్వామి మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యంం అమ్మకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహిపాల్ మరియు జీవన్. చెంగల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నూతుల రమేష్ , వసంత్ రెడ్డి , రవి,రాజు,ఎపిఎం రవీందర్ serp అధికారులు మరియు వీ ఓ ఏ అధ్యక్షురాలు రూప ,స్రవంతి,మార్కెటింగ్ కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు .వీఓఏ సునీత ,సుజాత, తదితరులు పాల్గొన్నారు.