నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ వెటర్నరీ హాస్పిటల్ పరిది లోని పశువులకు గొంతువాపు టీకాలు146 పశువులకు ఇవ్వడం జరిగింది అని పట్టణ పశు వైద్యాధికారి జియాయుద్దీన్ సోమవారం తెలిపారు. పశువులు ఉదయం మేత కొరకు బయటకు వెళ్లడం వలన హాస్పిటల్ తొందరగా తెరవాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు హాస్పిటల్ ఉదయం 8.00 గంటలకు తెరవడం జరుగుతోంది అని, కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలర నీ కోరినారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రోజా శ్రీ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.