నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వరి ధాన్యం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో సేర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డిఓ ప్రారంభించారు. వరి ధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.2320, బి గ్రేడ్ రూ. 2300 రూపాయలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దళారులను ప్రోత్సహించి మోసపోవద్దని రైతులకు సూచించారు.ఈకార్యక్రమంలో తాహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఏవో నాగరాజు, ఏపీఎం జి .శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, మాజీ సర్పంచ్ బత్తిని సాయిలు, ఏఈఓ విజయ్, సీసీలు రవీందర్ , అశోక్, బిక్షపతి, శివ చరణ్ సింగ్, రాజు తదితరులు పాల్గొన్నారు.