మహిళా సంఘాల IKP SERP ఆధ్వర్యంలో ఈ రోజు మెండోరా గ్రామంలో జిల్లాలోనే మొదటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని అమ్ముకోవద్దని మండల పరిషత్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు, దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తారని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తప్ప తాలు లేకుండా తీసుకురావాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎం రవిందర్, సీసీఎస్ శ్రీనివాస్, నరేష్,రఘుపతి మహిళా సంఘ అధ్యక్షులు లక్ష్మి,వీఓఏ శిరీష,గ్రామ నాయకులు గంగారెడ్డి, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.