రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని సర్పంచ్ అప్పనపల్లి శ్యామల ఆంజనేయులు సూచించారు.బుధవారం మం డ లంలోని రాంపూర్ గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్టర్ నిహారిక ఆధ్వర్యంలో ఉచి త పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఇందులో భాగంగా 22 పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు.15 పశువులకు సాధారణ చికిత్సలు,3 పశువులకు ఎద సూదులు వేశారు.18 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నిహారిక మాట్లా డుతూ పశువులకు ఎద లక్షణాల గురించి వివరించారు. గర్భకోశ వ్యాధుల గురించి వాటి నివారణ గురించి తెలిపారు.అనంతరం సర్పంచ్ గ్రామ సర్పంచ్ అప్పనపల్లి శ్యామల మాట్లాడుతూ గోపా ల మిత్రుల సేవలను రైతులు సద్వినియోగం చేసు కోవాలన్నారు.ఉచిత పశు వైద్య శిబిరాలను ఉప యోగించుకోని పశువుల వ్యాధుల బారిన నుండి కప కాపాడుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ టీసీ సుతారి లలిత రమేష్,పంచాయతీ కార్యదర్శి దివ్యగారు ఓఎస్ పురుషోత్తం, గోపాలమిత్ర సూప ర్వైజర్ భాస్కర్ గౌడ్,గోపాలమిత్రలు మహేందర్ రెడ్డి,వాజిద్,పాడి రైతులు,గ్రామ ప్రజలు తదితరు లు పాల్గొన్నారు.