రైతులు వరి పంటలో మొగి పురుగు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

నవతెలంగాణ – తొగుట
రైతులు వరి పంటలో మొగి పురుగు పట్ల జాగ్రత్త లు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు. శనివారం ఘనపూర్ గ్రామంలో వరి పంట పొలాలు సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వరి పొలాల ముల లో మొగి పురుగు ఉదృతి పరిశీలించి నట్లు తెలి పారు. మొగి పురుగు నివారణకు తొలి దశలో క్లోరనట్రా నీలి ప్రోల్ 0.4 గుళికలు ఎకరాకు 4 కేజీ లు, లేదా కార్తప్ హైడ్రో క్లోరైడ్ 4 g గుళికలు ఎకరా కు 8 kg లు వాడాలని సూచించారు. లేదంటే ఫైప్రోనిల్ గుళికలు 6 కేజీ లు, కట్పహైడ్రోక్లోరిదే 50% ఎస్పీ అనె మందుని ఎకరాకు 400 గ్రాము లు,క్లోరనెరనినిప్రోల్ 18.5 ఎస్ సి మందుని 60 ఎం ఎల్ ఎకరాకు, ఎసిఫేట్ 400 గ్రాములు వాడా లని తెలిపారు. ఈ సందర్శనలో రైతులు గొట్టం యాదగిరి,పుల్ల గూర్ల యెల్ల రెడ్డి, అక్కం బాలయ్య, వ్యవసాయ, విస్తరణ అధికారి దేవేందర్ తదితరు లు పాల్గొన్నారు.