
రైతులు పత్తి చేలలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు అన్నారు. పెద్దవూర మండలం లోని మండలం లోని వెల్మ గూడెం, తుంగతుర్తి, చలకుర్తి గ్రామాల్లో శుక్రవారం పత్తి పంటలను కృషి విజ్ఞానకేంద్రం కంపాసాగర్ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ, పల్లవి,పెద్దవూర, అనుముల మండలం లోని పలు గ్రామాల్లో పత్తిచేలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పత్తి సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరిస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడూ పాటించి పత్తి, కంది పంటలను సంరక్షించుకోవాలని పత్తిపంటలో తామరపురుగు, ఆకుమచ్చ తెగులు సోకినట్లయితే తామర పురుగు నివారణకు విప్రోనిల్ 2ఎంఎల్ లేదా ఫ్లోనిక్ అమైడ్ 0.3 గ్రాములు నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ఆకుమచ్చ తెగులు నివారణకు 1గ్రాము కార్బండిజమ్ పొడిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వర్షభావ పరిస్థితులు మరియు పొడి వాతావరణం వలన ప్రత్తి లో రసం పీల్చు పురుగుల ఉధృతి అధికమవుతుందని, లక్షణాలను గమనించినపుడు నీటి సౌకర్యం గల రైతులు తడి పెట్టుకొని ఎకరాకు 40 గ్రాములు ఎసిటమిప్రిడ్ ను పిచికారి చేయాలనీ సూచించారు. నెల వయసున్న ప్రత్తి పంటకు ఎరువులు వేయని రైతులు ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పోటాష్ ని వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో యంగ్ ప్రొఫెషనల్స్ చక్రవర్తి, కిరణ్, రైతులు పాల్గొన్నారు.