గాంధారిమండలంలోనిపోతంగల్ కలాన్ గ్రామ పరిధిలోనీ మొక్కజొన్న, శెనగ పంటలను మండల వ్యవసాయ అధికారి నరేష్ పరిశీలించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నరేష్ మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు గమనించటం జరిగిందని నివారణ కోసం ఎమ్మామెక్టిన్ బెంజోఏట్ 5% SG 100 గ్రాములు ఎకరానికి లేదా ఎమ్మామెక్టిన్ బెంజోఏట్ 0.9% + నోవాలురాన్ 5.25% 300 మీ లి ఎకరానికి వాడి నివారించవచ్చుని అలాగే శెనగ లో ఎండు తెగులు గుర్తించటం జరిగింది దీని నివారణ కోసం ట్రైకొ డర్మ విరిడే వాడడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ శోయంబ్ అహ్మద్ మరియు రైతులు పాల్గొన్నారు