నవ తెలంగాణ గాంధారి: మండలంలోని సీతాయ్ పల్లి , గండివెట్ గ్రామాలలోని జొన్న మరియు మొక్క జొన్న పంటలను ఎల్లారెడ్డి వ్యవసాయ సహయ సంచాలకులు రత్న ఎల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జొన్న లో కాండం తొలుచు పురుగు, మొక్క జొన్న పంట లో కాండం తొలిచే పురుగు మరియు కత్తెర పురుగు వున్నట్లు గమనించటం జరిగింది. వీటి నివారణ కోసం ఎమ్మామెక్టిన్ బెంజోఏట్ 5% SG 100గ్రాములు ఎకరానికి లేదా క్లోరాన్ ట్రనిలిప్రోల్ 18.5%SL 60 మీ లి ఎకరానికి పిచికారి చేసిమంచి ఫలితాలు పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయ అధికారి నరేష్ , ఏ ఈ ఓ షోయబ్ అహ్మద్ మరియు రైతులు పాల్గొన్నారు