
వరి పంటలో మొగిపురుగు నివారణ కోసం జాగ్రత్త లు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పేట గ్రామంలో వరి పంట పొలాలు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వరి పొలాల ములలో మొగి పురుగు ఉదృతి పరిశీలిం చి నట్లు తెలిపారు. మొగి పురుగు నివారణకు తొలి దశలో క్లోరనట్రా నీలి ప్రోల్ 0.4 గుళికలు ఎకరాకు 4 కేజీలు, లేదా కార్తప్ హైడ్రో క్లోరైడ్ 4 గ్రా. గుళికలు ఎకరా కు 8 కిలోలు వాడాలని సూచించా రు. లేదంటే ఫైప్రోనిల్ గుళికలు 6 కేజీలు, కట్ప హైడ్రోక్లోరిదే 50% ఎస్పీ అనె మందుని ఎకరాకు 400 గ్రాములు, క్లోరనెరనినిప్రోల్ 18.5 ఎస్ సి మందుని 60 ఎం ఎల్ ఎకరాకు, ఎసిఫేట్ 400 గ్రాములు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేల్పుల స్వామి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, రైతులు కుమ్మరి స్వామి తదిత రులు ఉన్నారు.