
ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామంలో వానాకాలం సీజన్ లో పండించే పంటల విషయంలో నకిలీ విత్తనాలపై రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేవదారికుంట గ్రామ ఎయివో మంజుల సూచించారు. మంగళవారం గ్రామంలో రైతులతో మాట్లాడుతూ.. పండించే పంటలు పత్తి, మొక్కజొన్న పలు రకాల విత్తనాలపై రైతులు నకిలీ విత్తనాలు తీసుకోకుండా జాగ్రత్తలు పడాలని విత్తనాలు కొనే సమయంలో రషీద్ తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాహుప్, రైతులు రతన్ సింగ్, వి.బాలు, పుల్లు, సేవ్యి, పంతుల, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.