– తాజా మాజీ ఎంపిపి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు సూచించారు. గురువారం మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని అటవీప్రాంతంలో ఉన్న చిన్నతరహా బొగ్గులవాగు ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ వరి పంటల సాగు కోసం ఇరిగేషన్ అధికారులతో కలిసి తూము ద్వారా నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులు నీటిని పొదుపుగా,నీటిని ఒడిసిపట్టి వాడుకోవాలన్నారు.ప్రాజెక్టు పరిధిలో ఎడ్లపల్లి, రుద్రారం,శభాష్ నగర్,కొయ్యుర్,కొండంపేట తదితర రెవెన్యూ గ్రామాల్లోని దాదాపు 5,150 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని తెలిపారు.ప్రాజెక్టులో ఇప్పటికే 0.4 టిఎంసీల నీరు చేరినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈలు రాజేందర్, రామచందర్, నాయకులు జనగామ బాపు,పోచయ్య, యదగిరిరావు,రైతులు పాల్గొన్నారు.