వ్యవసాయ సాగు కోసం రైతన్నలు ప్రతిరోజు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే వరుణుడు మాత్రం రాష్ట్ర రాజధానిలో కురుస్తున్నాడు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మద్నూర్ మండలం తో పాటు జుక్కల్ నియోజకవర్గం లో వర్షాలు కొరయడం లేక సాగు చేసిన రైతన్నలు వర్షాల కోసం తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నట్లు పట్టణ ప్రాంత ప్రజలు భారీ వర్షానికి అతులాకుతం అవుతుంటే, ఇక్కడి రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మాత్రం వర్షాలు కరువయ్యాయి. వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు భారీగా కురుస్తాయని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తాయని తెలియజేస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలంలో వర్షాలు పడడం లేక సాగు రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వర్షం అంటూ తల్లడిల్లుతున్నారు. గురువారం ఆకాశమంత నల్లటి మేఘాలతో వర్షం కురిసే విధంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి నల్లటి మేఘాలు దూరం అయిపోయాయి. వర్షం ఎందుకు కురియడం లేదనే రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. మంగళ బుధు వారాలు రెండు రోజులపాటు భారీ ఎండలు కొట్టాయి. గురువారం ఉదయం నుండి ఆకాశమంత నల్లటి మేఘాలతో భారీ వర్షం కురిసే విధంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి వర్షం పడకుండా తెల్ల తేటం అయిపోయింది. దీనితో అసలు వర్షాలు కురుస్తాయా లేదా అనే అనుమానం రైతన్నలకు ఆందోళన కలిగిస్తుంది. వర్షాల కోసం మండల వ్యవసాయ రైతులు తల్లడిల్లుతున్నారు.