
మండలం లోని వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన మైల నర్సయ్య (59) అనే రైతు అప్పుల బాధ భరించలేక ఉదయం ఐదు గంటల సమయంలో తన పంట పొలంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన మైల నర్సయ్య తనకున్న 6 ఎక్కరాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. తనకు ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు కాగా తన కూతురు వివాహానికి చేసిన అప్పు, పంట కోసం చేసిన అప్పులు పెరిగిపోయి పంటలు సరిగ్గా పండగ మనస్థాపనికి గురయ్యి ఆత్మహత్య కు పాల్పడ్డారని పేర్కొన్నారు. మృతునికి భార్య ప్రేమల, కొడుకు రాకేష్ లు వున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.