ఎంపీ సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

Farmers thanked MP Suresh Reddyనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం ఢిల్లీలో  రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో పసుపు బోర్డు ఏర్పాటు కొరకు  బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, నిజామాబాద్ జిల్లా రైతుల తరఫున సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి ని కలిసిన వారిలో చౌట్ పల్లి సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్  రెడ్డి, న్యాయవాది, మాజీ సింగల్ విండో చైర్మన్  ఏలేటి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, పలువురు రైతులు ఉన్నారు.