లక్ష రుణమాఫీ కార్యక్రమాన్ని తిలకిస్తున్న రైతులు 

Farmers watching lakh loan waiver programనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష రుణమాఫీ కార్యక్రమాన్ని రైతులు గురువారం తిలకించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్  ప్రతి జిల్లా వారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడిన సంభాషణలు రైతులు పూర్తిగా విని అర్థం చేసుకున్నారు. అంతకుముందు రైతు వేదిక ముందు లక్ష రుణమాఫీ చేసినందుకు  కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేస్తూ స్వీట్ తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. మండలంలోని పడకల్ రైతు వేదిక వద్ద రైతులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిక అర్గుల్ సింగిల్  గంగారెడ్డి, కొలిప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు, మునుపెల్లి మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ సింగ్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తొర్లికొండ శ్రీనివాస్ , జక్రాన్ పెళ్లి మాజీ సర్పంచ్  నర్సారెడ్డి, జక్రం పెళ్లి ఉపసర్పంచ్ కిషన్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.