నవతెలంగాణ – రెంజల్
తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ మొదటి విడత లాంచింగ్ కార్యక్రమాన్ని రెంజల్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు మండల కేంద్రంలోని రైతు వేదికలో తిలకించారు. మొదటి విడతగా సుమారు రూ.7 కోట్ల రూపాయలను విడుదల చేయగా ఆనందోత్సాహంలో రైతులు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు జి.సాయిరెడ్డి, సిహెచ్ రాములు, స్థానిక నాయకులు ధనుంజయ్, ఎమ్మెస్ రమేష్ కుమార్, శనిగరం సాయి రెడ్డి, జావీద్ ఉద్దీన్, మాజీ ఎంపీటీసీ కవిత, సింగిల్ విండో చైర్మన్ మొహీనుద్దిన్, గంగా గౌడ్, సాయిబాబా గౌడ్,, హైమద్ చౌదరి, ఎమ్మెల్ రాజు, వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీ నరసయ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అజయ్, ప్రసాద్, గోపికృష్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.