– దళారులను మోసపోవద్దు..
– వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ..
– పిఏసీఎస్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…!
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని బుడ్మి, తాడ్కోల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అవుతుందన్నారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం మద్దతు ధర, రైతు భరోసా ఇస్తుందన్నారు. రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో బుడిమి సొసైటీ ఛైర్మన్ గంగుల గంగారాం, వైస్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, వ్యవసాయ శాఖ ఎఇఓ రాణి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖాలేక్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్, అంజి రెడ్డి, గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, పిట్ల శ్రీధర్, నార్ల సురేష్, మాజీ సర్పంచ్ రాజు, ఆఫ్రోజ్, ఎజాస్, భీమా నాయక్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.