రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

నవతెలంగాణ – ధరూర్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మండ లం లోని రైతు వేదికల్లో ఘనంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి హాజరయ్యారు. అనంత రం ఎమ్మెల్యేకి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికా రు. రైతు దినోత్సవాల్లో భాగంగా ఎద్దుల బండ్ల ర్యాలీను ఎమ్మెల్యే ప్రారంభిం చా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి వెన్నె ముక రైతన్న కేసిఆర్‌ కల లుగన్న రైతు రాజు త్వరలోనే సాధ్యమవుతుందని తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదిక వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ నెల 12న సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది దినోత్సవ సందర్భంగా రైతు దినోత్సవ సంబరాలు గ్రామ గ్రామాన రైతులతో కలిసి ప్రతి గ్రామంలో పం డగ వాతావరణం నెలకొ ల్పిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ జంబురామన్‌గౌడ, మా ర్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, ఎంపీపీ నజూమన్నీసాబేగం, జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ పద్మమ్మ, మండల అధ్యక్షుడు డీఆర్‌ విజయ్, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ నర్సింహులు, బీఆర్‌ ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్‌ శ్రీధర్‌, జాకీర్‌, సుధా కర్‌రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.